lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chilipi manasu - yazin nizar lyrics

Loading...

చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి
చివర మరచి పంచుకున్న మమతలివి
క్షణము క్షణము కలిపి గడుపుతున్న గడపలివి

కలిసి మెలిసి కలలు కన్న కనులు ఇవి
ఎపుడో ఏ చినుకో ఏ నదిలో కలిసిందో
చివరికి అయ్యిందే తను సంద్రం
ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరో
చూస్తే అందరిదొకటే లోకం

చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి
చివర మరచి పంచుకున్న మమతలివి

ఆకాశమే తానుగా వచ్చిందిలా తారలే తెచ్చిందిలా
తోరణం కట్టిందిలా
ఆనందమే ఇక్కడే పుట్టిందిలా చుక్కలే పెట్టిందిలా
ముగ్గులై పండిందిలా
ద్వారం చేరే కన్నీరైన పన్నీరై పోయేలా
కారం నూరే కొపాలైనా గారం పోయేలా
రంగుల అనురాగం ఆరాటాలు
రమ్మని పిలిచిన ఈ లోగిల్లు

చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి
చివర మరచి పంచుకున్న మమతలివి

ఈకనులలో కాంతులే కళ్యాణాలు చూపులే
చందనాలు మాటలే మాణిక్యాలు
ఈ గుండెలో గాలులే సంగీతాలు లేవులే సంతాపాలు
గాధలే సంతోషాలు
తగ్గే కొద్దీ వస్తు ఉండే ఎక్కిల్లలో తలపు
తలోచోట తపిస్తున్న బంధాలను తెలుపు
తీర్చినా తీరిపోనంత ఋణం
తీర్చుకుందామనే తనం మనం

చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి
చివర మరచి పంచుకున్న మమతలివి

Random Song Lyrics :

Popular

Loading...