lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

my friend - studio artist lyrics

Loading...

పాద మెటు పోతున్నా
పయన మెందాకైనా
అడుగు తడబడుతున్నా

తోడు రాన
చిన్ని యెడ బాటైనా
కంట తడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోన
నేను లేన
ఒంటరైనా ఓటమయిన
వెంట నడిచే నీడ నీవే
ఓ… మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడుచిన నేస్తమా
ఓ… మై ఫ్రెండ్
ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ …

అమ్మ ఒడిలో
లేని పాశం
నేస్తామల్లే అల్లుకుంది
జన్మకంత తీరిపోని
మమతలెన్నో పంచుతుంది
మీరు మీరుల్లోంచి
మన స్నేహ గీతం
ఎరా ఎరా ల్లోకి మారే
మోమాటలే లేని కళే జాలు వారే
ఒంటరైన ఓటమయిన

వెంట నడిచే నీడ నీవే

ఓ… మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడుచిన నేస్తమా
ఓ… మై ఫ్రెండ్

ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ …

వాన వస్తే కాగితాలే
పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే, చిన్న నాటి
చేతలన్నీ చెంతవాలే
గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ

తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలు తుదలు తెలిపే
ముడే వీడకుందే

ఒంటరైనా ఓటమయిన
వెంట నడిచే నీడనైనా
ఓ… మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడుచిన నేస్తమా
ఓ… మై ఫ్రెండ్
ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ …

Random Song Lyrics :

Popular

Loading...