lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

manasulo madhve - sonu nigam feat. saindhavi, karthi & praneetha lyrics

Loading...

మనసులో మధువే కురిసెలే చినుకే
నా ఎదలో తేనెల జల్లే చిలుకగా నీవే
ఏమౌనో తనువే… తనువే

నా కంటిలో నీడై నిలిచి కలవరపెడితే
ఏఏమౌనో తుదకే… తుదకే
రాత్రి పున్నమి చందురుడా
నా చెలియా అది మరి నీ ముఖమే
వెన్నెలెలే పెరుగుతే తరుగునులే
నీ సొగసే తరిగిపోని వెన్నెలే
మదికి సూర్యుని కిరణాల
ప్రియతమా కావవి నీ కనులే
నీరు కను రెప్పలే స్వరములుగా
ప్రణయమా నన్ను ఏమి చేసేనో
ప్రియమా మది నీ వలన పులకించెలే
మనసులో మధువే కురిసెలే చినుకే

నింగికెగసే గువ్వల్లా
నీవు నేను కలిసేలా ఏకమై ఎగురుదాం
హొ నీలి మేఘ మాలికనై
పాలపుంత దాటుకొని పైకలా ఎగురుదాం
గాలల్లే కలగలిసిపోదామా
మబ్బుల్లో తేలిపోతూ ఊయలూగుదాం
నీవలా నడిచిన వింత కదా
నా ఎదుటే జరిగిన మాయ కదా
నీ చూపే నెరపిన తంత్రమిదా
నా దేహం ఏ దరింక చేరునో
కలలు నడుచుట సాధ్యములే
నా కలలు తీరుట నిశ్చయమే
నీ వేలు పట్టిన ఈ క్షణమే
నా సఖియా నీవు నాకు సొంతమే
ప్రియమా మది నీ వలన పులకించెలే
మనసులో మధువే కురిసెలే చినుకే

ప్రేమ గాలి శోకగనే కానరావు కాలములే
జగమిలా మారులే
ఏడు రంగుల హరివిల్లే వేయి రంగులు వెదజల్లే
హాయిలే, మాయలే
ఎండల్లో చిరు జల్లులాయెలే
మబ్బుల్లో తేలిపోతూ ఊయలూగుదాం
ఇలకు తారలు రావు కదా
వచ్చినా కనులను చూడవుగా
చూసినా చేతిని తాకవుగా
తాకితే ఏమవునో నా మది
ఇలకు తారలు వచ్చునుగా
వచ్చి నీ కనులను చూచునుగా
చూసి నీ చేతిని తాకునుగా
తాకితే పొంగిపోవు నీ మది
ప్రియమా మది నీ వలన పులకించెలే
మనసులో మధువే

Random Song Lyrics :

Popular

Loading...