paravasame - sachin warrier feat. divya s menon lyrics
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
ఆహా అంటోంది నా సంబరం!
వొడి లో వాలింది నీలాంబరం!!
మనసే పసి పావురం
వలపే తన గోపురం!!
వెతికీ కలిసెను నిన్నీ క్షణం!!
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం!!
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
నింగీ నీలం, ఆకూ పచ్చ
నువ్వూ నేనూ జంట వీడి పోమూ!!
అలుకూ రాగం, మెరుపూ మేఘం
దేహం ప్రాణం మనమై కలిశామూ!!
జతగా ప్రతి జన్మకీ
నువ్వే చెలి జానకి
నీలో సగమై జీవించనీ!!
యదలో సహవాసమై
వ్యధలో వనవాసమై
నీతో నీడై పయనించనీ!!
ఆహా అంటోంది నా సంబరం!
వొడి లో వాలింది నీలాంబరం!!
మనసే పసి పావురం
వలపే తన గోపురం!!
వెతికీ కలిసెను నిన్నీ క్షణం!!
కథలో మలుపీ స్వరం
కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం!!
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
పరవశమే! పరవశమే!
ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!
Random Song Lyrics :
- crystal crates - the quiett (더 콰이엇) lyrics
- yall niggas tweakin - nolanberollin lyrics
- chocobom - 8belial, yyy891, aft3erlife & johnnyfuu lyrics
- unhappy - bennett vickery lyrics
- prisoner - cassa jackson lyrics
- mission statement - gravebirth lyrics
- la bête - dgeogo lyrics
- beautiful life - aisel lyrics
- tmaai - miracle lyrics
- girl in the attic - ryan wright lyrics