original - s. p. balasubrahmanyam lyrics
ఆ.ఆ.ఆఅ.అ ఆ.అ ఆ.అ ఆ అ ఆ ఆ
అందాల హృదయమా. అనురాగ నిలయమా
అందాల హృదయమా. అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట.
అందాల హృదయమా. అనురాగ నిలయమా
అందాల హృదయమా. అనురాగ నిలయమా
ఏ పాటకైనా ఆ ఆ… కావాలి రాగము.ఊ.ఊ
ఏ జంటకైనా ఆ ఆ… కలవాలి యోగము.
జీవితమెంతో తీయనైనదనీ.
మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం
వలచే వారికి సందేశం
అందాల హృదయమా. అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట.
అందాల హృదయమా. అనురాగ నిలయమా
మనసున్న వారికే ఏ.ఏ. మమతాను బంధాలు
కనులున్న వారికే.ఏ.ఏ. కనిపించు అందాలు
అందరి సుఖమే నీదనుకుంటే.
నవ్వుతూ కాలం గడిపేస్తుంటే.
ప్రతి ఋతువు ఒక వాసంతం
ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
అందాల హృదయమా. అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట.
అందాల హృదయమా. అనురాగ నిలయమా
Random Song Lyrics :
- walk on the beach - moose truffle lyrics
- black force music - skilla baby lyrics
- inner sancticide - asinhell lyrics
- goddess - written by wolves lyrics
- одинокий волк (lone wolf) - tim (rus) lyrics
- dua - tibu km lyrics
- say something - c_domnick_fair lyrics
- alexandra leaving - patricia o'callaghan lyrics
- fumaça - pg, my g! lyrics
- lights out - jakobs castle lyrics