lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

aa thayi seethamma - s. p. balasubrahmanyam lyrics

Loading...

చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి

సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమైన చోట వేద మంత్రాలు
ఏకమైన చోట వేద మంత్రాలు

సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు

హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
ఓ ఓ ఓ… ఓ ఓ ఓ
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఓంపులెన్నో కొయి రంపమేయంగా
చినికు చినుకు గారాలే చిత్ర వర్ణాలు
సొంపులన్ని గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మా చిలక పాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు

సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అబ్బో ఆశ…
శృంగార పెళ్ళికొడకా… ఇది బంగారు వన్నె చిలకా
శృంగార పెళ్ళికొడకా ఇది బంగారు వన్నె చిలకా మువ్వకులిస్తే రాదు మోజుపడక
మువ్వకులిస్తే రాదు మోజుపడక

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

హేయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీప కాళికా
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీప కాళికా
రాయంటి చిన్నవాడా… మా రాయుడోరి చిన్నవాడా…
మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా
మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా
మనువాడతాను గాని మాను అలకా

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

Random Song Lyrics :

Popular

Loading...