lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

thaen sindhudhe vaanam (original) - s. p. balasubrahmanyam & s. janaki lyrics

Loading...

మాటేరాని చిన్నదని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా(మాటేరాని)

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే(మాటేరాని)

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందేవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే(మాటేరాని)

Random Song Lyrics :

Popular

Loading...