lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

priya raagale (from "hello brother") - s. p. balasubrahmanyam feat. chitra lyrics

Loading...

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం

సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ

అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయా నేనవుతా
కలకాలం కౌగిలై నినే చేరుకోని
కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని
ఓ ప్రియా… ఓ ఓ దరి చేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ

సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదేపదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖిచెలీ అందించు సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా చలే కాచుకొనా
ఓ ప్రియా… ఓఓ పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ ఓ

Random Song Lyrics :

Popular

Loading...