lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

from "maro charithra" - s. janaki lyrics

Loading...

పదహారేళ్ళకు. నీలో… నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు. నీలో… నాలో

ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి… వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు. నీలో… నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు.
పాటలు పాడిన చిరు గాలులకు…
తెరచాటొసగిన. చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ…
కోటి దండాలు. శతకోటి దండాలూ

పదహారేళ్ళకు. నీలో… నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన… తొలి జాములకు
సమయం కుదిరిన… సందె వేళలకు
నిన్నూ నన్ను… కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను… కన్న వాళ్ళకు
మనకై వేచే… ముందు నాళ్ళకూ
కోటి దండాలు. శతకోటి దండాలూ
కోటి దండాలు. శతకోటి దండాలూ
పదహారేళ్ళకు. నీలో… నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు. శతకోటి దండాలూ

Random Song Lyrics :

Popular

Loading...