lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

naa jeevitham neekankitham - nycil kk lyrics

Loading...

నా జీవితం నీకంకితం నీ సేవలోనే పునరంకితం
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము

కడగండ్ల సుడిలోన వడగండ్ల జడిలోన
ఏ తోడు రాకున్నా ఏ నీడ లేకున్నా
నా చెంత నీవుంటే చేయూత నిస్తుంటే
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము

ప్రతివాది చెరలోనే అపవాది ఉరిలోన
నే చిక్కిపోతున్నా నే నలిగి పోతున్నా
నీ ప్రేమ నాకుంటే నీ దీవెనె ఉంటే
కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన
మరువను నీ వాక్యము
విడువను నీ మార్గము

Random Song Lyrics :

Popular

Loading...