lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

kannulo unnavu - hariharan, saindhavi & vaikom vijayalakshmi lyrics

Loading...

పల్లవి
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఉభయ కుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే
అధర రుధిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగల్యే
మమతమసకు సమదససత ముదమనసుత సుమననయివ
సుసుతసగితగామం విరహరగిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం
కామయే

చరణం
హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనె
ఓఓఓ. ఓఓఓ. ఓఓఓ
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

చరణం
ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మా
కాలం ముగిసిన ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే
ఓఓఓ. ఓఓఓ. ఓఓఓ.

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
కన్నల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

contributed by ప్రణయ్

Random Song Lyrics :

Popular

Loading...