lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

bharatha maathaku jejelu - ghantasala lyrics

Loading...

భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆ… ఆ… ఆ…
చరణం: 1
త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి…
పంచశీల బోధించిన భూమి
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
చరణం: 2
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతిరత్నమై వెలిగిన నెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతిరత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవవీరులు వీరమాతలు… విప్లవవీరులు వీరమాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
చరణం: 3
సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతిమార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి…
లక్ష్యములైన విలక్షణ భూమి
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు… ఆ… ఆ…

Random Song Lyrics :

Popular

Loading...