
o nelaraja - ghantasala & p. susheela lyrics
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకెలొయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటె చూపు నీకేల చంద్రుడా
నా వెంటనంటి రాకోయి చంద్రుడా
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకెలొయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడువ మనకు తరమౌన చంద్రుడా
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకెలొయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా
లేత లేత వలపులే పూత పూయు వేళలో
కలవరింత లెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా
కలవరింత లెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకెలొయ్
మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
ఓ నెలరాజా
Random Song Lyrics :
- goodnight america (feat. adele) - johnny astro lyrics
- мне нравится (i like) - zeous lyrics
- drom america - ido vana lyrics
- way back - travis scott lyrics
- fresh out the box - neon hitch lyrics
- running away - jeremy loops lyrics
- g come giungla - ligabue lyrics
- take it all in - group 1 crew lyrics
- heard right - zach farlow lyrics
- dreams / sunshine - wretch 32 lyrics