lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

neekosam velasindi (from "prem nagar") - ghantasala & p. susheela lyrics

Loading...

నీకోసం… నీకోసం…
నీకోసం వెలిసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం

ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది
ప్రతి తీగ నీ ఒంపులు తెంచుకున్నది
ప్రతి పాదున నీ మమతే పండుతున్నది
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది
నీకోసం విరిసింది హృదయ నందనం

అలుపు రాని వలపును ఆదుకునే దిక్కడ
చెప్పలేని తలపులు చేతలయే దిక్కడ
చెడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలిచే మీ అనుభవాలు తుది చూసేదిక్కడ

కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు
శిల వంటి మనిషిని శిల్పంగా చేసావు
తెరవని నా గుడి తెరిచి దేవివై వెలిసావు
నువ్ మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం

Random Song Lyrics :

Popular

Loading...