mouname nee bhaasha - dr. m. balamuralikrishna lyrics
Loading...
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల సెగ నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
Random Song Lyrics :
- забуду (i'll forget) - gothexx lyrics
- flower$ pt. ii - yun$kriii lyrics
- sad & rich - mellodrama lyrics
- there and back again - goof ball prodigy lyrics
- fuori dal tuo riparo - samuele bersani lyrics
- problem - cast etr lyrics
- maintain - muano raps lyrics
- 666 - psychopeter lyrics
- how you live - braww_ug lyrics
- always, forever - rivers cuomo lyrics