manasulone nilichipoke - chinmayi sripada lyrics
హృదయ మామనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయ మాఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం
అదును చూసి అడగదేమి… లేనిపోని బిడియమా
ఊహలోనే ఊయలూపి… జారిపోకే సమయమా
తడబడే తలపుల తపన… ఇదని తెలపకా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమారా ప్రియా శశివదనా… అని ఏ పిలుపు వినబడెనా
తనపై ఇది వలనా… ఏదో భ్రమలో ఉన్నానా
చిటికే చెవిబడి తృటిలో మతి చెడి
నానా యాతన మెలిపెడుతుండగా
గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప
గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా
నా ప్రతి అణువణువు
సుమమై విరిసే తొలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు… తనకై వేచే నవ వధువు
చెలిమే బలపడి రుణమై ముడిపడే
రాగాలాపన మొదలవుతుండగా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
Random Song Lyrics :
- blue destiny (version two) - neil diamond lyrics
- pusher - toni der assi lyrics
- parrey - it's it's young e lyrics
- till the morning comes - roberta flack lyrics
- by the flames - neverwinter lyrics
- water days - andrew bennett lyrics
- festin d'noel - jeune ras lyrics
- redman - obie wanshot lyrics
- sun come up - glasses malone lyrics
- il saggio - gianfranco manfredi lyrics